Tuesday, February 15, 2011

ఇది కథ కాదు (పార్ట్-1)

హాయ్ ఫ్రిండ్స్ నా పేరు చిన్ను ఇది కథ కాదు అనేది నిజంగానే కథ కాదు. ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఒక వ్యక్తీ ఒక్కొక వయస్సులో ఎలా ఉంటాడో ఎన్ని మార్పులు జరుగుతాయో చివరికి ఆ వ్యక్తీ జీవితం ఎలా వుందో ఈ కథ చదువుతే మీకు తెలుస్తుంది, ఇక నా ఫ్రెండ్ కథ చదువుదామా?
                                  
వీడు పుట్టడమే విచీత్రంగా భూమి మీదకు వచ్చాడు. అది ఎలాగో చుడండి. సంతోష్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరు అమ్మాయిలు.  తరువాత వాళ్ళ అమ్మ పిల్లలు పుట్టకుండా  ఆపరేషన్ చేయించుకుంది, కానీ ఆపరేషన్ ఫెయిల్, వీడు భూమి మీదకు వచ్చాడు, వాడి పేరే  "సంతోష్". వాడి పేరు కు తగ్గట్టే  చాల హ్యాపీగ ఉండేవాడు, వీడికి బాధలు అంత పరిచయం లేవు. వాళ్ళ అమ్మ నాన్న కూడా వీడిని ఏమి అనేవారు కాదు, చాల అల్లరి, వాళ్ళ నాన్న వీడి  బాధ భరించ లేక హాస్టల్ లో వేశాడు 10th  వాడికి  అక్కడే, తరువాత ఇంటర్ వాడి టౌన్ లోనే కాలేజీ లో వేశాడు, ఇంటర్ మొత్తం చదువు తో ఐపోయింది.                
                        
వాడికి ఇంటర్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కిషన్, మోర్ రాజు, ప్యాక ప్రసాద్, వీరిలో కిషన్ అందరికంటే 2 years పెద్ద, సంతోష్, కిషన్ తమ్ముడు raghu 10th లో ఫ్రెండ్స్, ఇప్పుడు కిషన్ ఇంటర్ లో సంతోష్ ఫ్రెండ్. వీరిలో సంతోష్,కిషన్ ఇంటర్ పాస్ అయ్యారు, కిషన్ govt degree కాలేజీ లో జాయిన్ అవ్వుదామని సంతోష్ కి చెప్పాడు కానీ సంతోష్ వింటేనా!!! వాడు pvt కాలేజీ లో జాయిన్ అవుధమనుకునాడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక్కడే కొడుకు వాడు ఇంట్లో ఎం చెబుతే అది చెల్లుతుంది, వాడు pvt కాలేజీ లో జాయిన్ అయ్యాడు కిషన్ govt కాలేజీ లో అప్లికేషను పెట్టాడు వాడికి 2nd ఫేస్ లో బెర్త్  ఖాయమైంది. వాడు bcom (gen ) తెలుగు మీడియం లో జాయిన్ అయ్యాడు, ఇక మన హీరో గారు pvt కాలేజీ లో 1 మంత్  వెళ్ళాడు, వాడి ఇంటి ముందే  govt కాలేజీ లెక్చరర్ మేడం ఇల్లు, ఒక రోజు evening అందరు ఒక్క దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నపుడు మేడం వాళ్ళ నాన్న తో  మీ అబ్బాయి డిగ్రీ ఎక్కడ జాయిన్ అయ్యాడు? అని అడిగింది అప్పుడు వాళ్ళ నాన్న గారు వాడు pvt కాలేజీ లో జాయిన్ అయ్యాడు అని చెప్పాడు మేడం pvt లో కన్నా govt కాలేజీ లో మంచి సదుపాయాలు ఉన్నాయ్ అతన్ని అప్లై చేయమన్నది వాళ్ళ నాన్న తో.
                                           
వాళ్ళ నాన్న వీడ్ని బతిమిలాడి కర్మ కాలి వీడు దానికి ఒప్పుకొని  అప్లై చేసాడు అప్పటికే అన్ని లిస్టు లు ఓవర్, ఇక లాస్ట్ స్పాట్ అడ్మిషన్ ఉంది, వీళ్ళ మేడం ఏదో  చేసి వీడికి కాలేజీ లో బెర్త్  ఖాయం చేసింది.  అది BCOM (com ) ఇంగ్లీష్ మీడియం. వీడు అప్పటి వరకి తెలుగు మీడియం. వీడి కర్మ కాలి ఇంగ్లీష్  మీడియం సీట్ వచ్చింది. అదే  ఆ కాలేజీ లో  ఫస్ట్ బాచ్  ఇంగ్లీష్ మీడియం. అప్పుడు మన హీరో ఎంట్రి కాలేజీ లో...
                                               
అసలు కథ ఇపుడు మొదలవుతుంది.

Wednesday, February 2, 2011

మొదటి టపా.

హాయ్ ఫ్రెండ్స్. బ్లాగు లోకం లో  ఇదే నా మొదటి టపా.